మళ్ళీ నష్టాల్లో మార్కెట్లు
ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కేవలం ఒక్క రోజుకే పరిమితమైంది. రెండు రోజులుగా మూత పడిన హంగ్ కాంగ్ మార్కెట్ తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ అర శాతం లాభపడగా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మార్కెట్లు ఒక శాతం లాభపడ్డాయి. దీనికి కారణం నిన్న అమెరికా మార్కెట్లు రెండు శాతం దాకా లాభపడటమే. కాని మిడ్ సెషన్ నుంచి యూరో మార్కెట్లతో సహా ఇతర మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ఇక వాల్‌స్ట్రీట్ కూడా మళ్ళీ నష్టాల బాట పట్టింది. డాలర్ ఒక శాతంపైగా పెరగడంతో పాటు ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ నాలుగు శాతంపైగా పెరగడంతో ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన రిలీఫ్ ర్యాలీకి బ్రేక్ పడింది. నాస్డాక్ 1.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1 శాతం, డౌజోన్స్ 0.85 శాతం నష్టంతో ఉన్నాయి.