రైట్స్ ఇష్యూకు హెరిటేజ్ ఫుడ్స్ ఓకే
రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వాటాదారులకు తమ వద్ద ప్రతి ఒక షేరుకు ఒక షేర్‌ను అంటే 1:1 నిష్పత్తిలో జారీ చేస్తారు. రూ.5 ముఖ విలువ కలిగిన షేర్‌ను అదే ధరకు వాటాదారులకు జారీ చేస్తారు. రైట్స్ ఇష్యూలో 4,63,98,000 షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తం షేర్ల జారీ ద్వారా కంపెనీకి రూ.23.2 కోట్లు లభిస్తాయి. రైట్స్ ఇష్యూలో ఎవరైనా వాటాదారులు షేర్లను తీసుకోకపోతే.. కంపెనీ ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ వర్గాలు ఆ షేర్లను తీసుకుంటాయి. రైట్స్ ఇష్యూ సమయం, రికార్డు డేట్ మొదలైన అంశాలను త్వరలో ప్రకటిస్తారు. హెరిటేజ్ ఇష్యూ ప్రతిపాదన నేపథ్యంలో నిన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ 9.24 శాతం లాభంతో రూ. 340 వద్ద ముగిసింది. అంతకుమునుపు రూ. 372ను కూడా తాకింది.