17100 దాటిన నిఫ్టి
భారీ అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకుంటున్నట్లు కన్పిస్తోంది. రాత్రి రెండు శాతంపైగా నష్టపోయిన అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు ఇపుడు 0.8 శాతం పైగా లాభంతో ఉన్నాయి. ఇవాళ ఆరంభంలో ఒత్తిడికి లోనైన నిఫ్టి… ఆర్బీఐ పరపతి విధానం తరవాత పెరుగుతూ వచ్చింది. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు కూడా ఒక శాతం దాకా లాభపడటంతో… నిఫ్టి కూడా ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17100ని దాటి 17111ని తాకింది. ఇపుడు 17087 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు ఇపుడు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో మినహా నిఫ్టి టాప్ గెయినర్స్‌లో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలే ఉన్నాయి. హిందాల్కో 4.7 శాతం లాభడగా బజాజ్ ఫిన్ సర్వ్3.29 శాతం లాభంతో ఉంది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఏషియన్ పెయింట్స్ టాప్‌లో ఉంది. కాని నష్టం మాత్రం నామమాత్రమే. నిన్న లాభాల్లో ఉన్న అదానీ గ్రీన్ ఇవాళ 13 శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంకు షేర్లలో ఏయూ బ్యాంక్ 3.6 శాతం లాభంతో ఉంది. కెనరా బ్యాంక్ రూ.13.05 లాభపడి రూ.228 వద్ద ట్రేడవుతోంది.