వడ్డీ రేట్లు పెంపు
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. మేలో 0.40 శాతం రెపో రేటు పెంచిన ఆర్బీఐ జూన్, ఆగస్టులో అర శాతం చొప్పున పెంచింది. ఇవాళ మరో 0.50 శాతం పెంచడంతో కేవలం 4 నెలల వ్యవధిలో రెపో రేటు 1.90 శాతం పెరిగింది.