వపర్ గ్రిడ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఉన్న వాటాను పవర్ గ్రిడ్ కొనుగోలు చేసే అవకాశముందని వార్తలు రావడంతో ఇవాళ ఆ షేర్ భారీగా క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే పవర్ గ్రిడ్ షేర్ 8 శాతం క్షీణించి రూ.186ని తాకింది. అయితే అలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ షేర్ మొత్తం నష్టాలను పూడ్చుకుని మూడు శాతం లాభంతో ముగిసింది. ఆర్ఈసీలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఉన్న 52.63 శాతం వాటాను రూ. 14,400 కోట్లకు కొనుగోలు చేసే అంశాన్ని విద్యుత్ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ డీల్ కుదిరితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈపీఎస్ కనీసం 3 నుంచి 5 శాతం పడుతుందని బ్రోకింగ్ సంస్థ జెఫరేస్ పేర్కొంది. దీంతో ఆ షేర్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కేంద్రం వివరణతో షేర్ కోలుకుంది.