ఫైజర్ సీఈఓకు రెండోసారి కరోనా
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తయారు చేసిన ఫైజర్ కంపెనీ సీఈఓ అల్బర్ట్ బోర్లా రెండోసారి కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తనకు కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. నోటీ ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ పాక్స్లోవిడ్ వ్యాక్సిన్‌ను ఫైజర్, జర్మనీ కంపెనీ బయోఎన్టెక్లు అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అభివృద్ధి చేసిన బూస్టర్ డోస్‌ను మాత్రం తాను ఇంకా తీసుకోలేదని అల్బర్ట్ బోర్లా తెలిపారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను మోడెర్నా, ఫైజర్, బయోఎన్ టెక్ కలిసి అభవృద్ధి చేశాయి. గత ఆగస్టులోనే తాను వ్యాక్సిన్ వేసుకున్నానని.. నిబంధనల ప్రకారం ఇపుడు తాను బూస్టర్ వేసుకోవడానికి వీల్లేదని ఆల్బర్ట్ బోర్లా తెలిపారు.