ఎంటీఏఆర్కు భారీ ఆర్డరు
తమ కంపెనీకి చెందిన క్లీన్ ఎనర్జీ, సివిల్ న్యూక్లియర్ విద్యుత్తు విభాగాలకు రూ.540 కోట్ల ఆర్డర్లు లభించినట్లు ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పేర్కొంది. క్లీన్ ఎనర్జీ విభాగంలో ఆర్డర్లు పెరుగుతున్నాయని, ఈ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని ఎంటీఏఆర్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ విభాగంలో అనేక అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆ మేరకు తాము విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.