18000 దాటిని SGX NIFTY
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మంచి ఊపు మీద ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో క్లోజ్ కాగా, అమెరికా మార్కెట్లు ఒక శాతం పైగా లాభంతో క్లోజయ్యాయి. రాత్రి నాస్‌డాక్ 1.27 శాతం, ఎస్ అండ్ పీ 500 1.08 శాతం, డౌజోన్స్ 0.71 శాతం లాభంతో ముగిశాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ఇవాళ కూడా నష్టంతో ఉంది. అయితే బ్రెంట్ క్రూడ్ 93 డాలర్ల వద్ద ఉంది. డాలర్ భారీతగ్గడంతో మన మార్కెట్లకు ప్లస్‌గా చెప్పొచ్చు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే యూరప్, వాల్‌స్ట్రీట్‌లో లాభాలు లేవు. నిన్న భారీగా పెరిగిన మార్కెట్లు ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 110 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయి లాభాలు కొనసాగితే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18000 స్థాయిని దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి.