స్వల్ప నష్టాలతో ముగింపు
భారీ నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి స్వల్ప నష్టాలతో ముగిసింది. బ్యాంకు షేర్లు ఇవాళ ఒత్తిడికి లోను కావడంతో నిఫ్టి 31 పాయింట్లు నష్టంతో 17624 పాయింట్ల వద్ద క్లోజైంది. నిఫ్టి బ్యాంక్ ఇవాళ అర శాతం నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్ 0.35 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 0.72 శాతం లాభంతో ముగిశాయి. ఆటో షేర్లలో ఇవాళ గట్టి అమ్మకాల ఒత్తిడి కన్పించింది. టాటా మోటార్స్, బజాజ్ ఆటో రెండు శాతం పైగా నష్టపోయాయి. అయితే సిమెంట్ షేర్లకు మంచి మద్దతు లభించింది. శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్, ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ షేర్లకు మద్దతు లభించింది. ఎన్డీటీవీ షేర్ ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్లో క్లోజైంది. ఆ కౌంటర్లో వరుసగా మూడోరోజు కూడా కొనుగోలుదారులు లేరు. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలో కాన్కార్ 8 శాతం లాభపడగా డిక్సన్, ఆస్ట్రాల్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు నాలుగు శాతంపైగా లాభంతో ముగిశాయి.