For Money

Business News

ఫోన్‌ లాంచ్‌కు ముందు… యాపిల్‌ స్టోర్‌ డౌన్‌

గంట కాదు.. రెండు గంటలు కాదు… ఏకంగా మూడు గంటలు యాపిల్‌ స్టోర్‌ పనిచేయలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లు ఈ స్టోర్‌ ద్వారా ఏమీ కొనలేకపోయారు. సాంకేతిక కారణాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తినట్లు యాపిల్‌ కంపెనీ పేర్కొంది. యాపిల్‌ స్టోర్‌ మినహా.. యాపిల్‌కు సంబంధించిన ఇతర అన్ని వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి. దీంతో యాపిల్‌ 17 సిరీస్‌ ప్రారంభానికి ముందు యాపిల్‌ చేసిన మార్కెటింగ్‌ గిమ్మిక్‌ అని ఐటీ మార్కెటింగ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈసారి నాలుగు కొత్త ఐఫోన్లు, రెండు వాచ్‌లు, మరికొన్ని యాక్సిసరీలను యాపిల్‌ మార్కెట్‌లోకి విడుదల చేయొచ్చని భావిస్తున్నారు.