నష్టాల నుంచి తేరుకున్న నిఫ్టి
ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఊహించినట్లే అమ్మకాల ఒత్తిడికి వచ్చింది. మిడ్ సెషన్‌కు ముందు 17587 పాయింట్ల వద్దకు చేరింది. ఉదయం నిఫ్టి లెవల్స్‌లో పేర్కొన్నట్లు రెండో స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 17695 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు రిలయన్స్ షేర్లు నిఫ్టిని గ్రీన్‌లో ఉంచుతున్నాయి. 26 షేర్లు గ్రీన్‌లో ఉన్నా … లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఇటీవల బాగా పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ ఉంది. అయితే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు ఉంటుందని, అమెరికా మార్కెట్లు కుదుటపడితే భారీ షార్ట్ కవరింగ్ వస్తుందని అనలిస్టులు ఆశిస్తున్నారు. ఇవాళ యూరో మార్కెట్లు లాభాల్లో ఉన్నా… లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లోజింగ్ ఎలా ఉంటుందో చూడాలి.