For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్లు చివర్లో ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం ఒక మోస్తరు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి… యూరో పుణ్యమా అని కోలుకుంది. మిడ్‌సెషన్‌ తరవాత 17600పైకి వచ్చినా… చివర్లో లాభాల స్వీకరణ వచ్చింది. దీంతో 3 పాయింట్ల నష్టంతో 17539 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్లో క్లోజ్‌ కాగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. ఇక నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్‌ షేర్లు రెండు శాతంపైగా నష్టంతో నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక ఐటీసీ 1.81 శాతం లాభంతో రూ. 323 వద్ద ముగిసింది. ఎన్‌డీటీవీలో అప్పర్‌ సర్క్యూట్‌ ఇవాళ కూడా కొనసాగింది. షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో రూ. 519.80వద్ద ముగిసింది. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఇక ఆస్ట్రాల్‌ కంపెనీ షేర్‌ భారీ మద్దతు లభించింది. క్రూడ్‌ ధరలు భారీగా తగ్గడంతో ఈ షేర్‌ ఇవాళ ఆరు శాతంపైగా లాభపడింది.