మీ చెక్కుపై ఎవరు.. ఏం రాసినా.. మీదే బాధ్యత!
చెక్కుపై తాను సంతకం మాత్రమే చేశానని, ఇతరుల మిగిలిన వివరాలు రాశారంటూ… సదరు చెక్కు బాధ్యతను తిరస్కరించ లేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెక్కు సొంతదారు ఆ చెక్కుకు పూర్తి బాధత్య వహించాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు తిరస్కరించింది. చెక్కుపై సంతకం ఒక్కటే తనదని.. ఇతర వివరాలు తాను రాయలేదని పిటీషనర్ పేర్కొన్నాడు. ఇతర వివరాలు చెక్కు సొంతదారు రాశారా లేదా ఇతరుల రాశారా అన్నది తేల్చాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే ఈ అంశాలపై జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొపన్నలతో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రుణం చెల్లించడానికి ఇచ్చిన చక్కు విషయంలో .. కచ్చిత చెక్కు జారీ చేసిన వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెక్కుపై ఇతర వివరాలు తాను రాయలేదని .. చెక్కు జారీ చేసిన వ్యక్తి తప్పించుకోలేరని కోర్టు పేర్కొంది.