లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా.. ఉదయం నుంచి ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో రాత్రి కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. గత శుక్రవారం నాలుగు శాతం క్షీణించిన నాస్డాక్ రాత్రి మరో శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 సూచీతోపాటు డౌజోన్స్ కూడా అర శాతంపైగా నష్టంతో ముగిశాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ దూసుకుపోతోంది. రాత్రి డాలర్ ఇండెక్స్ 108.75 వద్ద ముగిసింది. ఇవాళ 109ని దాటుతుందేమో చూడాలి. మరోవైపు క్రూడ్ ఆయిల్ రాత్రి అనూహ్యంగా మూడు శాతంపైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 102.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ సరఫరాను ఒపెక్ మరింతగా నియంత్రిస్తుందన్న వార్తలతో ధరలు మండిపోతున్నాయి. మరోవైపు ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, తైవాన్ మార్కెట్లు గ్రీన్‌లో ఉండగా… చైనా, హాంగ్‌సెంగ్ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. జపాన్ నిక్కీ 0.84 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది.