For Money

Business News

కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌పై ఈడీ దాడులు

ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇవాళ దాడులు నిర్వహించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. తమ కంపెనీకి చెందిన అయిదు ఆఫీసీల్లో ఈడీ సోదాలు జరిగినట్లు కాయిన్‌ డెస్క్‌ వెల్లడించింది. కంపెనీ సీఈఓ, డైరెక్టర్లతో పాటు ఇతర ప్రధాన అధికారుల నివాసాలపై కూడా దాడులు జరిగాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తమ నుంచి వివరాలు సేకరిస్తుంటాయని… అందరికీ తాము సహకరిస్తామని కుబేర్‌ పేర్కొంది.