For Money

Business News

300 టికెట్‌ బుకింగ్‌ ఆఫీసులు మూసివేత?

భారత రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 300 టికెట్ల బుకింగ్‌ కౌంటర్లను మూసివేయాలని నిర్ణయించింది. వీటిని దశలవారీగా మూసివేస్తారని జీ బిజినెస్‌ న్యూస్‌ ఛానల్ పేర్కొంది. దాదాపు 80 శాతం మంది ప్రయాణీకుల ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారని రైల్వే శాఖ అంటోంది. ఈ నేపథ్యంలో బుకింగ్‌ కౌంటర్లను దశలవారీగా మూసివేయాలని భావిస్తోంది. దీనివల్ల రైల్వే వ్యయం తగ్గడమేగాక… దళారీ వ్యవస్థ తగ్గుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. ఈలోగా ఐఆర్‌సీటీసీ కూడా తన సర్వర్‌ కెపాసిటీ పెంచుకుంటుందని… క్రమంగా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను పూర్తిగా ఎత్తివేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ ఆదాయం మరింత పెరగనుంది. ఆన్‌లైన్‌ టికెట్ల కారణంగా ప్యాసింజర్ల డేటా మొత్తం రైల్వే శాఖ వద్ద ఉంటుంది. ఈ డేటాను మానెటైజ్‌ అంటే దీని ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను ఐఆర్‌సీటీసీ చూస్తోంది. దీనికిగాను ఇవాళ టెండర్లు కూడా పిలిచింది. ఈ వార్తలతో ఐఆర్‌సీటీసీ షేర్‌ ఇవాళ 8 శాతం పెరిగి రూ.723కి చేరింది.

https://twitter.com/ZeeBusiness/status/1560220894412546048?s=20&t=6_A7y20wybgfwG5wYXz_4Q