ఒకటే చార్జర్… కమిటీ ఏర్పాటు
ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. మొబైల్ ఫోన్లు లాప్‌టాప్‌లు, ఐపాడ్లు, వేరబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు … ఒకే చార్జర్ తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయనుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ విషయం చెప్పారు. ఈ కమిటీలు రెండు నెలల్లో తమ నివేదికలు సమర్పిస్తాయన్నారు. ఈ పద్ధతిని యూరప్ దేశాలు గత ఏడాది అమల్లోకి తెచ్చాయి. అన్ని మొబైల్స్ పనిచేసే ఒక చార్జర్‌ను కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలు చార్జర్లను ఫోన్‌తో పాటు అమ్మడం మానేశాయి.