స్వల్ప లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాస్తవానికి డౌజోన్స్ చాలా పటిష్ఠంగా ముగిసింది. నాస్డాక్ 0.19 శాతం నష్టంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.19 శాతం లాభంతో ముగిశాయి. ఇక డౌజోన్స్ 0.71 శాతం లాభంతో ముగిశాయి. నిన్న ప్రధాన కరెన్సీలన్నీ స్థిరంగా ఉన్నాయి. ఆయిల్ నిన్న రాత్రి మూడు శాతం క్షీణించింది. బ్రెంట్ క్రూడ్ ఇపుడు 92 డాలర్ల ప్రాంతంలో ఉంది. బులియన్ మార్కెట్ కూడా రాత్రి స్థిరంగా ఉంది. ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కోట్లు కూడా నిలకడగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒక్కటే 0.82 శాతం లాభంతో ఉంది. మిగిలిన సూచీల్లో పెద్ద కదలికలు లేవు. లాభాలు నష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో సింగపూర్ నిఫ్టి పాతిక పాయింట్ల లాభంతో ఉంది. సో.. మన మార్కెట్లు నిలకడగా ప్రారంభం కానున్నాయి.