17800ని తాకిన నిఫ్టి
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17800ని తాకింది. ప్రస్తుతం 17775 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 76 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి లో మహీంద్రా అండ్ మహీంద్రా గెయినర్స్‌లో టాప్‌లో ఉంది. తరవాతి స్థానంలో హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ తరువాతి స్థానంలో ఉన్నాయి. నిఫ్టిలో మొత్తం 39 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో టాప్ లూజర్‌గా గ్రాసిం నిలిచింది. ఈ షేర్ 3 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. జొమాటొ ఇవాళ ఏకంగా 7 శాతం దాకా పెరిగింది. అలాగే గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా 5 శాతం పైగా లాభపడింది. రాకేస్ ఝున్‌ఝున్ వాలాకు వాటా ఉన్న షేర్లలో ఒత్తిడి వస్తోంది. మెట్రో బ్రాండ్స్ షేర్ రూ.871ని తాకిన తరవాత రూ. 826ని తాకింది. ఇపుడు రూ.845 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ ధరలు భారీగా క్షీణించినందున… పెయింట్స్‌తో పాటు పిడిలైట్ షేర్ కూడా భారీగా లాభపడింది.