ఫేస్‌బుక్‌కు టీనేజర్లు గుడ్‌బై!
ఫేస్‌బుక్‌కు అమెరికా టీనేజర్ల (13 నుంచి 17 ఏళ్ళ వయస్కులు)లో ఆదరణ తగ్గుతోంది. మామూలుగా కాదు. మార్క్ జూకర్‌బర్గ్‌కు షాక్ తగిలేలా తగ్గింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) జరిపిన సర్వేలో ఈ షాకింగ్ న్యూస్ బయటపడింది. 2014-15లో అమెరికా టీనేజర్లలో ఫేస్బుక్ చూసే వారి సంఖ్య 71 శాతం ఉండగా, ఇపుడు 32 శతానికి పడిపోయినట్లు పేర్కొంది. అంటే సగానికిపైగా తగ్గారన్నమాట. ఫేస్బుక్ స్థానాన్ని అక్రమించిన సంస్థ ఏదో తెలుసా? టిక్ టాక్. చైనాకు చెందిన షార్ట్ వీడియోప్లాట్ఫామ్ ఇపుడు టీనేజర్లకు అత్యంత ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మారినట్లు Pew Researchలో బయటపడింది. అమెరికా టీనేజర్లలో 67 శాతం మంది తాము టిక్ టాక్ వాడుతున్నట్లు చెప్పగా.. 16 శాతం మంది ఎపుడూ వాడుతూనే ఉంటామని చెప్పారు. ఇక అమెరికా టీనేజర్లకు ఇష్టమైన టాప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్… యూట్యూబ్. టీనేజర్లలో 95 శాతం మంది తాము యూట్యూబ్ వాడుతున్నట్లు వెల్లడించారు. యూట్యూబ్ తరవాతి స్థానం టిక్టాక్దే.మూడో స్థానంలో ఇన్స్టాగ్రామ్, నాలుగో స్థానంలో స్నాప్‌చాట్ ఉంది.