మరింత పెరిగిన పేటీఎం నష్టాలు
ఇటీవల కోలుకుంటున్న పేటీఎం షేర్‌కు షాక్ తగిలింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్ఠాలు మరింత పెరిగాయి. ఈ మూడు నెలల్లో కంపెనీ నికర నష్టాలు రూ. 644 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.380 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 88 శాతం పెరిగి రూ. 1679 కోట్లకు చేరింది. అయితే కంపెనీ ఎబిటా (EBITDA) రూ. 93 కోట్ల నుంచి రూ. 275 కోట్లకు చేరింది. కంపెనీ సగటు నెలవారీ ట్రాన్సాక్టింగ్ యూజర్ (MTU) 49 శాతం పెరిగినట్లు పేటీఎం తెలిపింది. నిన్న ఈ షేర్ 3.20 శాతం తగ్గించి రూ. 783.65 వద్ద ముగిసింది.