స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు
తీవ్ర ఒడుదుడుకుల మధ్య ఆగస్టు నెలలో తొలివారం డెరివేటివ్స్ స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్ రెండు సార్లు నష్టాల్లోకి వెళ్ళింది. పైగా ఇవాళ ఎక్కవ సమయం నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. ఒకదశలో గరిష్ఠ స్థాయి నుంచి 300 పాయింట్లు నిఫ్టి కోలుకుంది. పడిన ప్రతిసారీ దిగువ స్థాయిలో నిఫ్టికి అద్భుత మద్దతు లభిస్తోంది. మిడ్ సెషన్ ముందు పడినా యూరో మార్కెట్లు ప్రారంభమైన తరవాత నిఫ్టి తన నష్టాలన్నీ రికవరయ్యాయి. క్లోజింగ్ ముందు లాభాల్లోకి వచ్చిన నిఫ్టి చివర్లో ఆరు పాయింట్ల నష్టంతో 17382 పాయింట్ల వద్ద ముగిసింది. యూరో మార్కెట్లు ఒకశాతం లాభంతో ఉండగా, అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి. డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నిఫ్టి బ్యాంక్ 0.62 శాతం నష్టపోగా… నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు అర శాతంపైగా లాభంతో ముగిశాయి. ఫలితాలకు స్పందిస్తూ సిప్లా, నెస్లే, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. దాదాపు ఫార్మా షేర్లన్నీ లాభాల్లో ముగిశాయి. జైడస్ లైఫ్,లుపిన్, టోరెంట్ ఫార్మా, లారస్ ల్యాబ్, అరబిందో ఫార్మా షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.