For Money

Business News

కొనసాగిన బుల్‌ ర్యాలీ

మార్కెట్‌లో నిఫ్టి పరుగు కొనసాగుతోంది. ఉదయం స్వల్ప ఒత్తిడికి లోనైనా దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు అందింది. అక్కడి నుంచి చివరి వరకు నిఫ్టి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా యూరప్‌ షేర్లు లాభాల్లో ప్రారంభం కావడంతో సెంటిమెంట్‌ మరింత బలపడింది. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు చాలా స్వల్పంగా ఉండటంతో మార్కెట్‌ పట్టించుకోలేదు. క్లోజింగ్‌కు ముందు 17356 పాయింట్లను నిఫ్టి తాకింది.ఈ స్థాయిలో స్వల్ప అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి 17340 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 182 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ఒక శాతం లాభపడగా, నిఫ్టి బ్యాంక్‌ 1.10 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 1.45 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 1.95 శాతం లాభపడింది. నిఫ్టిలో టాటా మోటార్స్‌ 7 శాతం దాకా లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలవడం విశేషం. తరవాతి స్థానంలో ఉన్న ఎం అండ్‌ ఎం 6 శాతం పైగా లాభపడింది. ఇవాళ అదానీ గ్రూప్‌తో పాటు రిలయన్స్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఇక నిఫ్టి లూజర్స్‌ సన్‌ ఫార్మా టాప్‌లో నిలిచింది. ఈ షేర్‌ 3 శాతం దాకా నష్టపోయింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆరు శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్‌, అదానీ ట్రాన్స్‌, అదానీ గ్రీన్‌, అదానీ విల్మర్‌ షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్‌ 12 శాతం దాకా లాభపడింది.