For Money

Business News

మెరుగు పడిన పనితీరు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ పనితీరు మెరుగు పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం సగానికి తగ్గగా కంపెనీ టర్నోవర్‌ 67 శాతం పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 186 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 360 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ కంపెనీ రూ. 360 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంటే ఈ మూడు నెలల్లో కంపెనీ పనితీరు బాగా మెరుగుపడందన్నమాట. అలాగే కంపెనీ టర్నోవర్‌ కూడా గత ఏడాదితో పోలిస్త ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ. 1413 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్‌ రూ. 844 కోట్లు మాత్రమే. Ebitda నష్టం రూ. 150 కోట్లకు తగ్గినట్లు జొమాటొ ప్రకటించింది.