దుమ్ము రేపిన నిఫ్టి
నిఫ్టికి అత్యంత కీలక స్థాయిని నిఫ్టి మళ్ళీ అందుకుంది. దేశీయంగా కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో నిఫ్టి మళ్ళీ 16650ను దాటింది. ఇవాళ ఓపెనింగ్‌లో తాకిన కనిష్ఠ స్థాయి 16438 స్థాయి నుంచి 200 పాయింట్లకు పైగా నిఫ్టి పెరిగింది. 16641 పాయింట్ల వద్ద 158 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టిలో 46 షేర్లు గ్రీన్‌లో క్లోజ్ కాగా, కేవలం నాలుగు షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న దివీస్ ల్యాబ్‌తోపాటు సన్ ఫార్మా, ఎస్బీఐ షేర్లు మూడు శాతం లాభంతో ముగిశాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ ఇవాళ రూ.1795 వద్ద ముగిసింది. టీసీఎస్ కూడా రెండు శాతంపైగా లాభపడింది. నిఫ్టి కన్నా అధికంగా ఒక శాతంపైగా లాభంతో నిఫ్టి బ్యాంక్ ముగిసింది. నిఫ్టి నెక్ట్స్0.82 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 0.96 శాతం లాభంతో ముగిసింది. నిన్నటి వరకు భారీ నష్టంతో ముగిసిన జొమాటొ ఇవాళ అయిదు శాతంపైగా లాభంతో ముగిసింది. ఇవాళ దివీస్, సన్ ఫార్మాతో పాటు లారస్ ల్యాబ్, అరబిందో ఫార్మా కూడా భారీ లాభాల్లో ముగిసింది. లారస్ ల్యాబ్ రికార్డ్ స్థాయిలో 6.4 శాతం లాభంతో క్లోజ్ కావడం విశేషం.