నష్టాల్లోనే కొనసాగుతున్న నిఫ్టి
ఒకదశలో 16500 దిగువకు వెళ్ళినా… వెంటనే కోలుకున్నా… నిఫ్టి ఇపుడు 16564 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 67 పాయింట్ల నష్టంతో ఉంది. ఉదయం నుంచి నిఫ్టి నష్టాల్లోనే కొనసాగుతోంది. ఈ వారం వీక్లీ, మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటంతో పాటు ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడ్ చేస్తున్నారు. ప్రధాన సూచీ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉన్నా… నిఫ్టి మిడ్ క్యాప్ 1.2 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టి నెక్ట్స్ కూడా 0.8 శాతం నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి పరవాలేదనుకున్నా 0.45 శాతం నష్టం తప్పలేదు. బజాజ్ ట్విన్స్ భారీ లాభాలతో నిఫ్టి ఫైనాన్షియల్స్ గ్రీన్‌లో ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్ ఇవాళ ఆరున్నర శాతం లాభపడి రూ. 13,442 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ కూడా 2 శాతం లాభంతో ఉంది. టాప్ లూజర్స్‌లో ఇన్ఫోసిస్ 3 శాతం లాభంతో టాప్‌లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హిందుస్థాన్ లీవర్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ కేవలం 0.19 శాతం నష్టంతో ఉంది.చూస్తుంటే యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఉదయం స్వల్ప లాభాల్లో ఉన్న హాంగ్‌సెంగ్ 1.93 శాతం లాభంతో ముగియడం విశేషం. అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు కూడా సగానికి తగ్గాయి. మరి నిఫ్టి చివర్లో కోలుకుంటుందేమో చూడాలి.