For Money

Business News

16,600 దిగువకు నిఫ్టి

రిలయన్స్‌ షేర్‌ ఇవాళ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అలాగే మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ కూడా. దీంతో నిఫ్టి 16706 పాయింట్ల నుంచి 16564 పాయింట్లకు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 16616 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో పాటు అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. దీంతో మన మార్కెట్లు కోలుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టిలో దాదాపు 36 షేర్లు నష్టాల్లో ఉన్నా.. చాలా వరకు షేర్లు నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి. ఉదయం అరశాతంపైగా లాభాల్లో ఉన్న నిఫ్టి బ్యాంక్‌ సూచీ ఇపుడు 0.3 శాతం నష్టంతో ఉంది. మిగిలిన సూచీల్లో నష్టాలు పెద్దగా లేవు. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.35 శాతం నష్టంతో ఉంది. జొమాటో 14 శాతంపైగా క్షీణించి ఇపుడ రూ.5.90 నష్టంతో రూ.47.75 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు ఈ షేర్‌ రూ.46కు పడిపోయింది. ప్రి ఇష్యూ సమయంలో పెట్టుబడులు పెట్టిన యాంకర్‌ ఇన్వెస్టర్ల షేర్లపై ఉన్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఇవాళ అయిపోయింది. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లు బయటపడినట్లు తెలుస్తోంది.