కుప్పకూలి… కోలుకుంది
రాత్రి అమెరికా మార్కెట్లలో బంగారం ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. డాలర్ రోజు రోజుకీ బలపడుతుండటం, ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో బంగారంలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. రాత్రి అమెరికా మార్కెట్లలో ఔన్స్ బంగారం 1706 డాలర్లకు క్షీణించింది. బంగారానికి అత్యంత కీలక స్థాయి ఇది. ఈ స్థాయి కోల్పోతే మాత్రం బంగారం అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయి. అయితే రాత్రి 1706 డాలర్ల నుంచి 1723 డాలర్లకు కోలుకుంది. ఇపుడు 1729 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షీణిస్తున్నందున… మన మార్కెట్లలో బంగారం ధర అధికంగా కన్పిస్తోంది. డాలర్‌తో నిన్న 22 పైసలు క్షీణించిన రూపాయి… ఇవాళ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు పెరిగే పక్షంలో 80ని క్రాస్ చేసే అవకాశముంది. వెండి కూడా రాత్రి 18.80 డాలర్లకు కుప్పకూలింది. ఆ తరవాత వెంటనే కోలుకుని ఇపుడు 19.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిన్న ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం రూ.368 లాభంతో ముగిసింది.