For Money

Business News

1,800 సిబ్బందిపై మైక్రోసాఫ్ట్‌ వేటు!

అమెరికాలో అపుడే మాంద్యం ఛాయలు కన్పిస్తున్నాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో మాంద్యం ఖాయమని కొందరు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కూడా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 1800 మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రస్తుతం కంపెనీలో 1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఒక్క శాతం మందిని తొలగిస్తున్నారన్నమాట. వీరిలో ఆఫీసర్‌, ప్రొడక్ట్‌ డివిజన్‌ స్థాయి సిబ్బంది ఉన్నారని మైక్రోసాఫ్ట్‌ అంటోంది.