For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో పోలిస్తే మార్కెట్లు చాలా వరకు రికవరయ్యాయని చెప్పొచ్చు. నాస్‌డాక్‌ సూచీ చాలా వరకు కోలుకుని కేవలం 0.15 శాతం నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ మాత్రం 0.45 శాతం నష్టంతో ముగిసింది. క్రూడ్‌ ఆయిల్ ధరలు భారీగా క్షీణించడంతో ఎనర్జీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అలాగే గ్రోత్‌ స్టాక్స్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో డౌజోన్స్‌ 0.67 శాతం నష్టపోయింది. అంతక్రితం యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ మార్కెట్‌ గ్రీన్‌లో ఉన్నా…చైనా, హాంగ్‌సెంగ్‌ నష్టాల్లో ఉన్నాయి. నష్టాలు నామమాత్రం ఉండటం కాస్త ఊరట కల్గించే అంశం. సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.