For Money

Business News

16,100పైన ముగిసిన నిఫ్టి

వీక్లీ డెరివేటివ్స్‌ ప్రభావంతో చివర్లో స్వల్ప ఒత్తిడి వచ్చి… నిఫ్టి మళ్ళీ కోలుకుని 16100 పాయింట్లపైన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి.ఈ నేపథ్యంలో నిఫ్టికి పడిన ప్రతిసారీ మద్దతు లభించింది. రెండు గంటల ప్రాంతంలో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16045కి నిఫ్టి పడినా… షార్ట్‌ కవరింగ్‌ తో ఏకంగా వంద పాయింట్లకు పైగా పెరిగి 16150ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా తగ్గి 16132 వద్ద ముగిసింది. నిఫ్టి 38 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి 0.89 శాతం లాభపడగా, నిఫ్టి బ్యాంక్‌ 1.74 శాతం లాభపడింది. నిఫ్టి నెక్ట్స్‌ 0.82 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీ 1.12 శాతం లాభంతో ముగిసింది. ఇక నిఫ్టి షేర్ల విషయానికొస్తే …మెటల్స్‌ ఇవాళ మెరిశాయి. అనూహ్యంగా హిందాల్కో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నిన్నటి నుంచి ఈ షేర్‌ను చాలా మంది రెకమెండ్‌ చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కూడా ఒకటి నుంచి మూడు నెలల వ్యవధిలో రూ.376 టార్గెట్‌గా పేర్కొంది. ఇవాళే ఆ షేర్‌ 7 శాతం లాభంతో రూ.364.40 వద్ద ముగిసింది. టాటా స్టీల్‌ 5.63 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.76 శాతం లాభంతో ముగిశాయి. ఇక టైటన్‌ 5.78 శాతంతో రూ. 2125 వద్ద ముగిసింది. ఇక లూజర్స్‌లో 1.25 శాతం నష్టంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ టాప్‌లో ఉంది.