మాంద్యం భయం… మార్కెట్లు టపటపా
హాలిడే తరవాత ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌లో భారీ అమ్మకాల ఒత్తితి వస్తోంది. గత కొన్ని నెలలుగా ఐటీ షేర్లు భారీగా క్షీణించగా. తొలిసారి ఎకానమీ షేర్లపై ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో నాస్డాక్ కేవలం 0.74 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.77 శాతం, డౌజోన్స్ 2.17 శాతం క్షీణించాయి. ఇప్పటికే అనేక ఐటీ, టెక్ షేర్లు 40 శాతం నుంచి 50 శాతం దాకా క్షీణించాయి. ఇపుడు గ్రోత్ స్టాక్స్‌ను అమ్ముతున్నారు. ఒక్క డాలర్ మినహా ఈక్విటీతో అనేక మార్కెట్లు పతనమౌతున్నాయి. అమెరికా పదేళ్ళ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ రెండున్నర శాతం తగ్గాయి. క్రూడ్ ఆయిల్ ఏకంగా ఆరు శాతం తగ్గింది. బంగారం, వెండి రెండు శాతం పైగా పడ్డాయి. కేవలం డాలర్ మాత్రమే దూసుకుపోతోంది.