ఓపెనింగ్‌లోనే 15650
సింగపూర్ నిఫ్టికి పూర్తి భిన్నంగా భారీ నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 15650ని తాకింది. తరవాత కోలుకుని 15691 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 88 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి భారీగా క్షీణించడంతో ఐటీ, ఫార్మా కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, విప్రో టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టైటాన్ రికార్డు స్థాయిలో 5 శాతంపైగా నష్టపోయింది. అలాగే బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టితో పాటు దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే నిఫ్టి నెక్ట్స్ దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. ఇక నిఫ్టి మిడ్ క్యాప్ 0.66 శాతం నష్టపోయింది. నిఫ్టి బ్యాంక్ ఇవాళ 0.78 శాతం నష్టపోయింది. మరి నిఫ్టి 15650ని తాకడంతో… ఇవాళ్టి కనిష్ఠ స్థాయి ఏర్పడినట్లేనని కొందరు అనలిస్టులు అంటున్నారు. 15730 దాటే వరకు నిఫ్టికి ఒత్తిడి ఉంటుందని మరికొందరు అంటున్నారు.