భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్లు
అమెరికా కరెన్సీ, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా నాస్డాక్ ఇవాళ 2.24 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.42 శాతం తగ్గింది. ఇక డౌజోన్స్ కూడా ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. అంతకుముందు బ్యాంకు షేర్ల ధరలు పెరగడంతో సూచీలన్నీ గ్రీన్లో ఉన్నాయి. కాని కొన్ని నిమిషాల్లోనే సూచీల పతనం ప్రారంభమైంది. లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా పెరిగినా… డాలర్ మాత్రం అరశాతంపైగా పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ 104ను దాటేసింది. ఇక క్రూడ్ ధరలు ఇవాళ కూడా రెండున్నర శాతం వరకు పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ 113.5 డాలర్లకు చేరింది. ఇక బులియన్ మార్కెట్లో బంగారంలో పెద్ద కదలకలు లేవు. కాని వెండి ఒకటిన్నర శాతం క్షీణించింది.