వీటికి జీఎస్టీ మినహాయింపులు ఎత్తివేత
జీఎస్టీ విధానంలో ఇపుడున్న విధానాన్ని హేతబద్ధీకరించేందుకు కర్ణాటక సీఎం బీఎస్ బొమ్మై నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రలు బృందం ఇచ్చిన తాత్కాలిక నివేదికను జీఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్ ఆమోదించినట్లు తెలుస్తోంది. చండీఘడ్‌లో ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమవేశం ప్రారంభమైంది.రేపు కూడా కొనసాగనుంది. మంత్రుల బృందం చేసిన సిఫారసులన్నింటిని కౌన్సిల్ ఆమోదించింది.
మంత్రుల బృందం చేసిన సిఫారసులు:
ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇపుడు ఇస్తున్న మినహాయింపులకు మంగళం.
రోజుకు రూ .1000 లోపు ఛార్జ్ చేసే హోటల్ వసతిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చారు. ఇప్పటి వరకు వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండేది. ఇకపై ఈ సేవలపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.
ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందే రోగులు రూ. 5 వేల కన్నా ఎక్కువ అద్దె కలిగిన గదిపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. (ఐసీయూలకు మినహాయింపు) పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్స్, బుకో పోస్ట్, ఎన్వలప్ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు )లు మినహా అన్ని పోస్టల్ సేవలపైనా జీఎన్డీ వసూలు చేస్తారు.
చెక్ పుస్తకాలపై (విడిగా లేదా పుస్తకంగా ఉన్నా సరే) 18 శాతం జీఎస్జీ వసూలు చేస్తారు.
కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉండే దుకాణాల అద్దెలపై జీఎస్టీ ఉంటుంది.
ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణంపై ఇస్తున్న రాయితీని ఎత్తేశారు.
వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా పొగ వేయటం, గోదాముల్లో గింజల నిల్వ, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జీఎస్జీ పరిధిలోకి తెచ్చారు.
తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయల సేవా పన్ను మాత్రం ఉండదు.