మీడియా ఇండస్ట్రీ రూ. 4.3 లక్షల కోట్లకు
2026కల్లా భారత మీడియా పరిశ్రమ 4,30,401 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్ కూపర్ (PwC) పేర్కొంది. ఈ సంస్థ రూపొందించిన గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా ఔట్లుక్ 2022-2026 నివేదికలో ఈ అంశం పేర్కొంది. ఏటా ఈ పరిశ్రమ 8.8 శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2026కల్లా ప్రపంచ న్యూస్‌పేపర్ పరిశ్రమలో ఫ్రాన్స్, బ్రిటన్లను అయిదో స్థానానికి చేరుతుందని పేర్కొంది. అలాగే వచ్చే అయిదేళ్ళు క్రమం తప్పకుండా ప్రతిఏటా ఆదాయం పెరిగే ఏకైక మార్కెట్ భారత్‌దేనని తెలిపింది. 2021లో న్యూస్‌పేపర్ ఆదాయం రూ. 26378 కోట్లు కాగా 2026కల్లా 29945 కోట్లకు చేరుతుందని PwC అంచనా వేసింది. అలాగే 2020లో పోలిస్తే ఏడాదిలో ఓటీటీ ఆదాయం రెట్టింపు అయిందని పేర్కొంది. 2026కల్లా టీవీ అడ్వర్టయిజింగ్ మార్కెట్లో మనదేశం అయిదవ స్థానంలో ఉంటుందని తెలిపింది. 2026కల్లా సినిమా ఆదాయం రూ. 16198 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.