For Money

Business News

పసిడి రవాణాకూ ఈ-వే బిల్లు !

పసిడి రవాణాకు కూడా ఈ వే బిల్లు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పసిడి, విలువైన లోహాలు, రాళ్ల అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే రూ.20 కోట్లకు మించి వార్షిక టర్నోవర్‌ ఉండి పన్ను చెల్లింపుల పరిధిలో ఉన్న వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఇతర వ్యాపారులు, వ్యాపార సంస్థలకు (బీ2బీ) సరఫరా చేసే పసిడి, విలువైన రాళ్ల రవాణా లావాదేవీలకు ఈ-ఇన్వాయిస్‌ను తప్పనిసరి. 28-29 తేదీల్లో జరిగే జీఎస్‌టీమండలి సమావేశంలో వీటిపై రాష్ట్ర మంత్రులు చర్చించనున్నారు.