For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిన్న భారీగా అమ్మకాల ఒత్తిడికి గురైన షేర్లు ఇవాళ స్వల్ప మద్దతు అందడంతో నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 15461ని తాకిన నిఫ్టి నష్టాల్లోకి చేరింది. ఇపుడు మళ్ళీ 40 పాయింట్ల లాభంతో 15457 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 135 పాయింట్లు లాభపడింది. ఇతర ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టి మాదిరి కేవలం నామ మాత్రపు లాభాలకే పరిమిమయ్యాయి. నిఫ్టిలో 28 షేర్లు లాభాల్లో ఉన్నా… లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆటో షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్ షేర్లు 2.5 శాతం లాభంతో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌ ఒక శాతంపైగా నష్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇక బ్యాంక్‌ షేర్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇవాళ వీక్లీ క్లోజింగ్ ఉన్నందున.. నిఫ్టిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయేమో చూడాలి.