15,480ని తాకిన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15480ని తాకింది. ప్రస్తుతం 106 పాయింట్ల లాభంతో 15456 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి అప్ బ్రేకౌట్ 15471. మరి ఈ స్థాయిని దాటి ఏ మేరకు నిలదొక్కుకుంటోదో చూడాలి. టెక్నికల్ అనలిస్టులు మాత్రం 15500 పైన నిఫ్టి అమ్మమని సలహా ఇస్తున్నారు. నిన్న భారీగా క్షీణించిన షేర్లు ఇవాళ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టిలో 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు మూడు శాతం లాభంతో హిందాల్కో టాప్ గెయినర్‌గా నిలిచింది. నిన్న భారీగా క్షీణించిన నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్ అర శాతం లాభంతో ట్రేడవుతోంది.