For Money

Business News

వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ బిల్లు

వివాదాస్పద విద్యుత్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు విద్యుత్‌ పంపిణీపై చాలా రాష్ట్రాల్లో గుత్తాధిపత్యం ఉంది. అంటే లైసెన్సింగ్‌ విధానం ఉంది. కొత్త బిల్లు ప్రకారం విద్యుత్ పంపిణీ రంగంలో పోటీతత్వం పెంచేందుకు డీలైసెన్సింగ్‌ విధానం అమల్లోకి తేనున్నారు. దీంతో పలు కంపెనీలు విద్యుత్తు అమ్మే అవకాశం లభిస్తుంది. ఫిక్కీ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ మాట్లాడుతూ… విద్యుత్‌ రంగంలో పలు ప్రైవేట్‌ కంపెనీలను ప్రవేశించేందుకు వీలుగా చట్టంలో మార్పులు తెస్తున్నామని అన్నారు. దీనికి అందరూ అంగీకరిస్తున్నారని… వచ్చే వర్షాకాల సమావేశంలో బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇపుడు ఎలాగైతే మొబైల్ ఫోన్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు పలు కంపెనీలు ఉన్నాయో… విద్యుత్‌ను కూడా పలు కంపెనీలు ఉంటాయి. కస్టమర్‌ తనకు ఇష్టమైన కంపెనీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యజమాయిషీలలోఉన్న డిస్కమ్‌ల గుత్తాధిపత్యానికి తెరపడనుంది. మున్ముందు ప్రైవేట్ కంపెనీల పాత్ర పెరుగుతుంది. అంటే సబ్సిడీలు పోతాయన్నమాట.