For Money

Business News

డల్‌గా నిఫ్టి… అసలు సీన్ రేపు

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసినా మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి కీలక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… నిఫ్టి 15700పైన ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లో 15780ని తాకిన నిఫ్టి ఇపుడు 15714 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 17 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ సూచీలో కూడా పెద్ద మార్పు లేదు. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీలు అర శాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో ఇవాళ 35 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కాని అన్నీ నామ మాత్రపు లాభాలు మాత్రమే. టాటా స్టీల్‌ ఒక్కటే రెండున్నర శాతం లాభంతో ఉంది. ఆటో రంగానికి చెందిన షేర్లు గ్రీన్‌ ఉన్నాయి. ఇటీవల భారీగా క్షీణించిన బజాజ్‌ ఫైనాన్స్‌ స్వల్ప లాభంతో ఉంది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ ముందుంది. రిలయన్స్‌ మళ్ళీ రూ.2600 స్థాయికి వచ్చేసింది. క్రమంగా పేటీఎం బలపడుతోంది. అలాగే జొమాటో. జొమాటొపై పలు ప్రతికూల నివేదికలు వస్తున్నాయి. కాని షేర్‌ పడటం లేదు. ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ను సోనీ గెలవడంతో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్‌ రెండున్నర శాతం పెరిగింది. ఇవాళ రాత్రికి ఫెడ్‌ నిర్ణయం రానుంది. అలాగే రేపు నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి ఇవాళ మార్కెట్‌లో పెద్ద హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చని అనలిస్టులు అంటున్నారు.