For Money

Business News

ఎలాగైనా లాభం ఖాయం

ఫెడ్‌ తరవాత మార్కెట్‌ కదలికలు చాలా కీలకమని ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ఫెడ్ నిర్ణయం మార్కెట్‌కు సానుకూలంగా ఉంటే 16000ను దాటుతుందని, లేదాంటే 15000 దిగువకు నిఫ్టి చేరుతుందని ఆయన అన్నారు. ఫెడ్‌ నిర్ణయం తరవాత మార్కెట్‌లో ఎలాంటి మార్పు లేకపోతే.. ఇన్వెస్టర్లకు పెద్దగా లాభనష్టాలు ఉండవని అన్నారు. అయితే నిఫ్టి తీవ్ర కదలికలు ఉంటాయని భావించేవారు …అలాగే రిస్క్‌ తీసుకునేవారు 15600 పుట్‌, 15800 కాల్ తీసుకోవడం మంచిదని ఆయన అన్నారు. మార్కెట్‌ ఎటువైపు కదలాడిన కచ్చితంగా లాభం వస్తుందని ఆయన అన్నారు. ఫెడ్‌ నిర్ణయం తరవాత మార్కెట్‌లో 500 పాయింట్లు ఉంటుందని, అది ఎటువైపో రేపు తెలుస్తుందని అన్నారు. ఇలాంటి సమయంలో నిఫ్టి ఎటువైపు వెళ్ళినా లాభం రావాలంటే పుట్, కాల్ కొనుగోలు చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
840 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 20
టార్గెట్‌ : రూ. 38

అమ్మండి
పీఎఫ్‌సీ
స్టాప్‌లాప్‌ : రూ. 104
టార్గెట్‌ : రూ. 96

కొనండి
ఎస్‌బీఐ కార్డ్స్‌
730 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 19
టార్గెట్‌ : రూ. 25

కొనండి
టాటా పవర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 216
టార్గెట్‌ : రూ. 228

అమ్మండి
అరబిందో ఫార్మా
స్టాప్‌లాప్‌ : రూ. 525
టార్గెట్‌ : రూ. 552