పెట్టుబడులకు అడ్డా హైదరాబాద్
పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్, టీ సెల్లు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. హైటెక్ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లైవ్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్‌లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు.తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. స్థానికంగా పెట్టుబడులు, తయారీ యూనిట్లు పెట్టేవారికోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకొచ్చామన్నారు. తయారీ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారబోతోందని ఆయన అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా మారిపోతుందని అన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతోపాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్ కంట్రోల్ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Live: IT Minister @KTRTRS speaking at the inaugural event of @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad https://t.co/1vhUD9oqK6
— KTR, Former Minister (@MinisterKTR) June 14, 2022