స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి
యూరో మార్కెట్లపై గంపెడాశతో పెరిగిన నిఫ్టి…ఆ మార్కెట్లు గ్రీన్లో ఉన్నంత వరకు ఫరవాలేదనిపించాయి. ఆ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాక… నిఫ్టి కూడా నష్టాలతో ముగిసింది. యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు నిఫ్టి 15858 పాయింట్లను తాకింది. దీనికి ప్రధాన కారణం అప్పటి వరకు యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లో ఉండటం. ఆరంభంలో జర్మనీ డాక్స్తో సహా పలు యూరో మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా ఎస్ అండ్ పీ కూడా ఒక శాతం లాభంలోఉంది. కాని కొద్ది సేపటికే యూరో నేష్టాల్లోకి జారుకుంది. ఎస్ అండ్ పీ 500 లాభాలు ఒక శాతం 0.3 శాతానికి పడిపోయాయి. అప్పటి వరకు లాంగ్ వెళ్ళిన చాలా మంది ఇన్వెస్టర్లు బయటపడ్డారు. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 42 పాయింట్ల నష్టంతో 15732 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టినెక్ట్స్ తప్ప మిగిలిన ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. కాకపోతే అన్నీ నామ మాత్రమే. ఎన్టీపీసీ టాప్ గెయినర్ కాగా, బజాజ్ఆటో టాప్ లూజర్ కావడం విశేషం. బజాజ్ ఆటో షేర్లను రూ.4000 టార్గెట్ చాలా మంది ఇన్వెస్టర్లు రెకమెండ్చేశారు. దీనికి కారణంగా ఇవాళ సమావేశమై కంపెనీ బోర్డు షేర్ల బై బ్యాక్ను వాయిదా వేయడం. దీంతో షేర్ ఇవాళ 4.8 శాతం నష్టంతో ముగిసింది.