రెడ్డీస్ ల్యాబ్ …MACD ప్రతికూలం
మార్కెట్ మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే నిన్న కొన్ని షేర్లలో బుల్లిష్ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. వాటిల్లో బ్రైట్‌కామ్ గ్రూప్, మోతిలాల్ ఓస్వాల్, రెడింగ్టన్ ఇండియా, జేబీ కెమికల్స్, రైట్స్ కౌంటర్లలో MACD అనుకూలంగా ఉంది. అలాగే కొన్ని షేర్లలో బేరిష్ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సీమెన్స్, బ్లూడార్ట్, నెస్లే ఇండియా, క్యాస్ట్రాల్, టీటీకే ప్రిస్టేజ్ ఉన్నాయి. ఈ షేర్లలో పతనం ప్రారంభమైనట్లు కన్పిస్తోంది.
నిన్నటి ట్రేడింగ్ చూస్తే… ఎన్ఎస్ఈలో వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఆర్‌పీఎల్, భారతీ ఎయిర్టెల్, చెన్నై పెట్రోలియం, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. అదే ఎన్ఎస్ఈలో వాల్యూమ్ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే ఎంఆర్‌పీఎల్, వోడాఫోన్ ఐడియా, ఫ్యూచర్ రీటైల్, సుజ్లాన్ ఎనర్జి, టీవీ18 బ్రాడ్కాస్ట్, జొమాటో ముందున్నాయి.