#BoycottIndianGoods ట్రెండింగ్
కొన్ని గంటల్లోనే అరబ్ దేశాల్లో పరిస్థితి మారిపోయింది. మహమ్మద్ ప్రవక్తను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో అరబ్ దేశాల్లో వైరల్ అయింది. టైమ్స్ నౌ ఛానల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బీజేపీ నేతలను విమర్శిస్తూ వేల సంఖ్యలో పోస్టులు వస్తున్నాయి. అరబ్ దేశాలు బహిరంగంగా క్షమాపణలు కోరుతూ భారత దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేశాయి. ఒక్కోదేశం ప్రకటన చేయడం ప్రారంభమైంది. మరోవైపు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాల్లోని సూపర్ స్టోర్స్‌లో భారత వస్తువులను బహిష్కించడం ప్రారంభించారు. షో రూమ్‌లు కూడా భారత వస్తువులపై దుస్తులు కప్పేసి… భారత్ వస్తువులను తాము విక్రయించడం లేదని బోర్డులు పెట్టాయి. మతపరమైన అంశాల గురించి వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోని అరబ్ దేశాలు … ప్రవక్తపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో అరబ్ దేశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. పెద్ద పెద్ద కంపెనీలు భారతీయులను ముఖ్యంగా హిందువులను ఉద్యోగాల నుంచి తొలగించడం ప్రారంభమైంది. అనేక మంది తమ వద్ద ఉన్న కార్మికులను తొలగిస్తున్నట్లు ట్వీట్ చేయడం… ఇది వైరల్‌గా మారింది. ఒకరిని చూసి మరొకరు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించారు. భారత ఉప రాష్ట్రపతి కతర్ పర్యటనలో ఉండగా… ఇలాంటి ఘటనలు జరగడంతో బీజేపీ వెంటనే స్పందించింది. బీజేపీ నేతలను సస్పెండ్ చేసింది.
Grocery stores in Middle East remove Indian products to punish India for insulting prophet Mohammad (pbuh) Large scale boycott campaign announced in Muslim countries https://t.co/NTCYkBT2t3#الهند #Arab ##إلا_رسول_الله_يا_مودي
— South Asian Journal (@sajournal1) June 5, 2022
Just IN:— Superstores in Saudia Arabia, Kuwait, Bahrain remove Indian products after insulting remarks against Prophet Muhammad by Indian PM Modi's close aide.
— South Asia Index (@SouthAsiaIndex) June 5, 2022
The Ministry of Foreign Affairs Summons the Indian Ambassador and Hands Him an Official Note on Qatar’s Total Rejection and Condemnation of the Remarks of an Official in the Ruling Party in India Against Prophet Mohammed#MOFAQatar pic.twitter.com/rp7kMnWXdu
— Ministry of Foreign Affairs – Qatar (@MofaQatar_EN) June 5, 2022