For Money

Business News

17,800 చేరువలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16787 స్థాయిని తాకింది. ఇపుడు 16784 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 157 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్‌లో నాస్‌డాక్‌ లాభాల ప్రభావం ఇవాళ మన మార్కెట్‌లోకన్పిస్తోంది. దాదాపు అన్ని ఐటీ కంపెనీల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడువుతున్నాయి. నిఫ్టి 5 టాప్‌ గెయినర్స్‌లో నాలుగు ఐటీ షేర్లు ఉన్నాయి. అల్ట్రాటెక్‌ భారీ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. దీతో ఒక్కసారిగా మొత్తం పరిశ్రమలోని కంపెనీలు రెడ్‌లోకి వెళ్ళాయి. అల్ట్రాటెక్‌ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. దాదాపు అన్ని ప్రధాన నిఫ్టి సూచీలు ఒక శాతం దగ్గరగా లాభపడ్డాయి. ఒక జొమాటోలో అప్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇవాళ మరో మూడున్నర శాతం పెరిగి రూ.74.45 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టి మిడ్‌ షేర్ల విభాగంలో మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు డామినేట్‌ చేస్తున్నాయి. పెర్సిస్టెంట్, ఎంఫిసిస్‌ టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. ఇక బ్యాంక్‌ షేర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముందుంది.