For Money

Business News

అప్‌ సైకిల్‌కు రెడీ

గత కొన్ని రోజులుగా సిమెంట్‌ డిమాండ్‌ తగ్గింది. ధరలు తగ్గాయి. కొన్ని నెలలు నిలకడగా ఉన్న సిమెంట్‌ రంగం ఇపుడు క్రమంగా పెరిగేందుకు రెడీ అవుతోంది. అప్‌సైకిల్ ప్రారంభానికి సిమెంట్‌ రంగం సిద్దంగా ఉందని ప్రముఖ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంటోంది. దేశ వ్యాప్తంగా సిమెంట్‌ డిమాండ్‌ పెరగనుందని… అనుగుణంగా కంపెనీల సామర్థ్యం వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇటీవల కాస్త కరెక్షన్ వచ్చిన నేపథ్యంలో వాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్‌ పెరుగుతుందని తెలిపింది. ఈ రంగం నుంచి ఆరు కంపెనీలను ఈ సంస్థ రెకమెండ్‌ చేసింది.
అల్ట్రా టెక్‌ షేర్‌
ప్రస్తుత ధర : రూ.6000
టార్గెట్‌ రూ. 8800
శ్రీ సిమెంట్స్‌
ప్రస్తుత ధర : రూ.21585
టార్గెట్‌ రూ.29,000
గ్రాసిం ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర : రూ.1435
టార్గెట్‌ రూ. 1800
దాల్మియా భారత్‌
ప్రస్తుత ధర : రూ.1374
టార్గెట్ రూ.1700