For Money

Business News

పబ్లిక్‌ ఆఫర్‌కు పేమేట్‌ రెడీ

చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా మొత్తం రూ .1,500 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో రూ .1.125 కోట్లు విలువ చేసే తాజా షేర్లను ఆఫర్‌ చేయనుంది. దీనితో పాటు ఇపుడున్న ఇన్వెస్టర్లు రూ .375 కోట్లు విలువ చేసే షేర్లను అమ్ముకుంటారు. చాలా రోజుల తరవాత తాజా ఆఫర్‌ ద్వారా నిధుల సమీకరణకు ఓ కంపెనీ వస్తోంది. ఇది వరకు వచ్చిన ఐపీఓలన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ అంటే… ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లను అమ్ముకోవడమే లక్ష్యంగా వచ్చాయి. ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపునకు 66.70 శాతం వాటాలున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధుల్లో రూ .77 కోట్లను వ్యాపార విస్తరణకు, రూ .228 కోట్లను ఇన్‌ ఆర్గానిక్‌ కార్యకలాపాలకు, రూ .668 కోట్లను తమ భాగస్వామ్య ఆర్థిక సంస్థల వద్ద నగదు తనఖా కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.