గరిష్ఠ స్థాయి వద్ద ముగిసిన నిఫ్టి
మార్కెట్ ఇవాళంతా చాలా పటిష్ఠంగా ట్రేడైంది. మిడ్ సెషన్‌లో ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16695ని తాకిన తరవాత లాభాల స్వీకరణతో కొద్దిగా క్షీణించింది. అయితే చివర్లలో వచ్చిన మద్దతు కారణంగా దాదాపు గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 309 పాయింట్లు పెరిగి రూ. 16,661 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 1041 పాయింట్లు పెరిగింది. ఉదయం నుంచి నిఫ్టి బ్యాంక్ ఒక్కటే కాస్త తక్కువ లాభాలతో ట్రేడైంది. నిఫ్టితో పోలిస్తే నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు భారీగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్‌గా నిలిచింది. కొటక్ బ్యాంక్ టాప్ లూజర్‌గా ఉంది. ఆటో, ఐటీ షేర్లకు మంచి డిమాండ్ లభించింది. ఫలితాలు ప్రకటించిన జూబ్లియంట్, డిక్సన్ వంటి షేర్లు పది శాతంపైగా లాభంతో ముగిశాయి. జొమాటొ, పేటీఎం కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఎల్‌ఐసీ ఫలితాలు ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో షేర్ రూ.16 లాభంతో రూ. 837 వద్ద ముగిసింది. ఫుట్‌వేర్‌కు చెందిన బాటా, మెట్రో బ్రాండ్స్ కూడా ఇవాళ పది శాతం లాభపడ్డాయి. అయితే క్యాంపస్ యాక్టివ్ షేర్ మాత్రం స్వల్ప లాభాలతో ముగిసింది.